Site icon Bhakthi TV

తిరుమేయచ్చూర్ లలితాంబికా క్షేత్ర విశేషాలేంటంటే..

తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరుమీయాచ్చూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో లలితాంబికా క్షేత్రం ఉంటుంది. ఇది చాలా పురాతన ఆలయం. దాదాపు 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని చోళ రాజుల కాలంలో నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇది శివుడి క్షేత్రం. అయినా కూడా ప్రాధాన్యత అంతా లలితాంబికా దేవిదే. ఇక్కడ వెలిసిన పరమేశ్వరుడిని మేఘనాథ స్వామిగా పిలుస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ సూర్య భగవానుడు తపస్సు చేసి తన వెలుగును తిరిగి పొందాడని ఆలయ స్థల పురాణం చెబుతోంది.

తిరుమేయచ్చూర్ లలితాంబికా క్షేత్ర విశేషాలేంటంటే..

ఈ క్షేత్రంలో లలితాంబికా అమ్మవారిని సౌందర్య నాయికిగా భక్తులు కొలుస్తారు. అలాగే ఇక్కడ వెలిసిన దుర్గాదేవికి ఎనిమిది చేతులు ఉంటాయి. అందువల్ల దుర్గమ్మను శుఖ బ్రహ్మగా కొలుస్తారు. దుర్గమ్మ ఒక్క చేతిలో చిలుక ఉంటుంది. ఈ చిలుక శాంతికి సంకేతంగా నిలుస్తుంది కాబట్టి సంస్కృతంలో చిలుక శుఖం అని కూడా అంటారు. అందుకే ఇక్క అమ్మవారిని శుఖ బ్రహ్మదేవిగా ఆరాధిస్తారు. నాయనర్లలో ఒకరైన రుజ్ఞాన సంబంధనార్ తాను రచించిన పద్యాల్లో మేఘనాథ స్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని తెలిపారు. ఈస్వామి సన్నిధిలో భక్తులు ఎవరైనా కావొచ్చు.. జన్మదినాలు జరుపుకుంటే వారికి దీర్ఘాయువు కలుగుతుందట.

Share this post with your friends
Exit mobile version