Site icon Bhakthi TV

ఇక్కడి పంచముఖ ఆంజనేయుడి విశేషాలేంటంటే..

రామాయణం ప్రకారం హనుమంతుడు ‘మై రావణుని’ సంహార సమయంలో పంచముఖ అవతారాన్ని స్వీకరించినట్లుగా కంభ రామాయణం చెబుతోంది. ఇలాంటి పంచముఖ ఆంజనేయుడి క్షేత్రాలు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, గణధాల్ (గణదల్) గ్రామంలో పంచముఖ ఆంజనేయుడు కొలువుదీరాడు. ఆలయ స్థల పురాణం ప్రకారం.. మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి తన దేశ సంచారంలో భాగంగా తుంగభద్రా నదీ తీరానికి వెళ్లాడట. ఆ నదికి ఆవల వైపున ఉన్న గాణదాళ, బిక్షాలయ అనే గ్రామాలను సైతం దర్శించేవారట.

ఇక్కడి పంచముఖ ఆంజనేయుడి విశేషాలేంటంటే..

ఆ సమయంలో గాణదాళలోని ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక్కడే రాఘవేంద్రునికి హనుమంతుడు దర్శనమిచ్చినట్లుగా తెలుస్తోంది. స్వయంభువుగా రాతిపై వెలసిన ఆంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన పంచముఖ హనుమ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గుహలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో కాకుండా, రాతిపై వెలిసినట్లు కనిపిస్తాడు. ఇక్కడి ఆంజనేయుడు తూర్పు దిక్కుని చూస్తుంటాడు. ఉగ్ర నరసింహుడు వచ్చేసి దక్షిణ దిక్కుని.. అబీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే గరుడుడు సకల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామి ధన ప్రాప్తిని, ఊర్ధ్వ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని సిద్ధింపజేస్తారని ప్రతీతి.

Share this post with your friends
Exit mobile version