Site icon Bhakthi TV

కాశీలోని బృహస్పతి మందిర విశేషాలేంటంటే..

కాశీలో బృహస్పతి మందిరం విశ్వనాథుని ఆలయానికి కేవలం కిలో మీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం వెళ్లే మార్గంలో ఉంది. దేవతల గురువైన బృహస్పతి ఆలయం కాశీలోని ఇతర దేవతల ఆలయాల కంటే ఎత్తులో ఉంటుంది. దీనిని చేరుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలో గర్భాలయంలో బృహస్పతి సుందర రూపుడై మనకు దర్శనమిస్తాడు. అయితే ఈ క్షేత్రాన్ని కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న మీదటే దర్శించుకోవాల్సి ఉంటుంది. నిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ క్షేత్రంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

కాశీలోని బృహస్పతి మందిర విశేషాలేంటంటే..

ముఖ్యంగా బృహస్పతి ఆలయంలో స్వామివారికి త్రికాల హారతులు ఇస్తుంటారు. అలాగే ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో రాత్రి 11 గంటలకు మరో ప్రత్యేక హారతి కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఏకాదశి, పౌర్ణమి వంటి తిథులతో పాటు మహాశివరాత్రి, గురుపూర్ణిమ వంటి పర్వదినాలను ఇక్కడ అత్యంత వైభవంగ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవిత్రమైన శ్రావణ మాసంలో హరియాలి పేరిట ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారమైతే గురువు ఒక శుభగ్రహం. ఎవరి జాతకంలో అయినా గురువు అనుకూలంగా ఉంటే సకల శుభాలు లభిస్తాయట. అందుకే ఇక్కడ గురు గ్రహఅనుగ్రహ కోసం పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends
Exit mobile version