ఆంజనేయస్వామిని పంచముఖ ఆంజనేయుడిగా పిలుస్తారు. ఈ ఆంజనేయుడు మన ఇంటి ముందు ఉంటే.. ఎలాంటి దుష్ట శక్తి ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదని నమ్మకం. మరి ఆంజనేయస్వామి పంచముఖ రూపం ఎప్పుడు ధరించారు? అనేది తెలుసుకుందాం. ఇది రామాయణాంతర కథల్లో (ప్రత్యేకంగా తాంత్రిక, ఆగమ సంప్రదాయాల్లో) వస్తుంది. ఒకసారి మహిరావణుడు (అహిరావణుడు) అనే రాక్షసుడు.. శ్రీరాముడు, లక్ష్మణుడిని పాతాళలోకానికి తీసుకెళ్లాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు: పాతాళ లోకానికి వెళ్లి ఒకే సమయంలో ఐదు దీపాలను ఆర్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆంజనేయడు పంచముఖ రూపాన్ని ధరించాడు.
పంచముఖాలు – ఐదు దివ్య ముఖాలు
1. హనుమాన్ ముఖం (తూర్పు): ధైర్యం, భక్తి, శత్రు విజయానికి ప్రతీక
2. నరసింహ ముఖం (దక్షిణ): నరసింహస్వామి, భయం తొలగింపు, చెడు శక్తుల నాశనానికి ప్రతీక
3. గరుడ ముఖం (పడమర): గరుడుడు, నాగదోష నివారణ, విష ప్రభావం తొలగింపునకు ప్రతీక
4. వరాహ ముఖం (ఉత్తరం): వరాహస్వామి, సంపద, స్థిరత్వం, భూసంబంధ సమస్యల నివారణకు ప్రతీక
5. హయగ్రీవ ముఖం (పై భాగం): హయగ్రీవ, జ్ఞానం, విద్య, మేధస్సు పెంపునకు ప్రతీక
