రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో ఉన్న ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం అత్యంత విశిష్టమైన, రహస్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సాధారణ దేవాలయాల్లా ప్రతిరోజూ దర్శనం లభించదు. ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అదీ మహాశివరాత్రి రోజున మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఏడాది పొడవునా మూసి ఉండే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. శివరాత్రి రోజున ఆలయ తలుపులు తెరవగానే వేలాదిమంది భక్తులు తరలివస్తారు. శివుడి ఏకలింగ స్వరూపం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఒక్కరోజు దర్శనం అయినప్పటికీ, ఆ దర్శనంతో జన్మధన్యమౌతుందని, అపారమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం శివభక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

