Site icon Bhakthi TV

No VIP Darshan : ఈ దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు పూర్తిగా బంద్‌… ఎందుకో తెలుసా?

ఈ దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు పూర్తిగా బంద్‌... ఎందుకో తెలుసా? | Devotional News | Bhakthi TV

భక్తులందరికీ సమాన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బంకే బిహారీ ఆలయంలో ఇకపై సామాన్యుడు, ప్రముఖుడు అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో దర్శనం చేసుకుంటారు. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రలో పారదర్శకత, భక్తుల భద్రత కోసం వీఐపీ వ్యవస్థను తొలగించారు. వారణాసి కాశీ విశ్వనాథ ఆలయంలో మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో వీఐపీ దర్శనాలు ఉండవు. మహారాష్ట్ర తుల్జా భవానీ ఆలయంలో అవినీతి ఆరోపణలతో వీఐపీ పాస్‌లు రద్దయ్యాయి. విజయవాడ కనకదుర్గ ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ప్రత్యేక సందర్భాల్లో వీఐపీ దర్శనాలను నిలిపివేస్తారు. భక్తి ముందు హోదా కాదని, దేవుడి ముందు అందరూ సమానమేనని ఈ నిర్ణయాలు చాటి చెబుతున్నాయి.

No VIP Darshan In Shri Banke Bihari Temple
Share this post with your friends
Exit mobile version