Site icon Bhakthi TV

Mookambika Devi Miracles : అక్షరాభ్యాసానికి ప్రసిద్ది పొందిన కొల్లూరు మూకాంబికా దేవి… ఈ కథే నిదర్శనం

అక్షరాభ్యాసానికి ప్రసిద్ది పొందిన కొల్లూరు మూకాంబికా దేవి...ఈ కథే నిదర్శనం | Kolluru Mookambika Devi

కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఆదిశంకరాచార్యులు కుడజాద్రి పర్వతంపై తపస్సు చేయగా సరస్వతీ దేవి ప్రత్యక్షమై….ఆయన వెంట నడిచివచ్చిందని పురాణకథనం.   అయితే, వెనక్కి తిరిగి చూడకూడదన్న అమ్మవారి షరతును శంకరులు ఉల్లంఘించడంతో… కొల్లూరులోనే అమ్మవారు విగ్రహ రూపంలో స్థిరపడింది. ఆ తరువాత శంకరాచార్యులు పంచలోహ మూకాంబికా విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా కొల్లూరులో ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు శివునితో కలిసి జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ  ప్రసాదాన్ని బావిలో వేసే సంప్రదాయం ఉంది. అలా బావిలో వేసే సమయంలో ఒక కేరళ వాసి నీటి అడుగున ఉండి ప్రసాదాన్ని స్వీకరించి మహాపండితుడు అయ్యాడు. ఈ ఆలయంలో అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా పూజిస్తారు. అందుకే అమ్మవారి ఆలయంలో విజయదశమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు.

Mookambika Devi Miracles
Share this post with your friends
Exit mobile version