Site icon Bhakthi TV

భారత్‌లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే..

శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారు కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం కూడా ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించుకోవడం అంత సులువైనది కాదు. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ విశేషమేంటంటే.. అమ్మవారి నుదురు తాకితే మనిషి నుదురు తాకినట్టుగా మెత్తగా ఉంటుంది.

భారత్‌లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీశైలం దేవస్థానం విరాజిల్లుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఇది విరాజిల్లుతోంది. మోక్షాన్ని ప్రసాదించే శిఖర దర్శనం ఇక్కడి మరో ప్రత్యేకత. ఈ పరిసరాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో ఇష్ట కామేశ్వరిదేవి కొలువై ఉంది. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం. మన సొంత వెహికిల్‌లో వెళ్లడానికి అవదు. దీనికోసం ప్రత్యే వెహికిల్స్ ఉంటాయి. వాటిల్లో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా ఇష్టకామేశ్వరి దేవి పేరిట ఆలయం కనిపించదు.

Share this post with your friends
Exit mobile version