Site icon Bhakthi TV

తాళ్లయ్య పాలెం పంచముఖ శివుడి క్షేత్ర విశేషాలేంటంటే..

గుంటూరు జిల్లా తాళ్లయ్య పాలెం పంచముఖ పరమేశ్వరుడి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు సైతం కొలువుదీరి ఉంటాడు. వినాయకుని ఆలయానికి పక్కనే ఆలయానికి ఒక ‘గోశాల’ ఉంటుంది. శివుని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా సిద్ది బుద్ది సమేత వినాయకుడిని దర్శించుకుంటారు. ఆ తరువాత వెంటనే గోశాలలోని గోమాతను పూజించిన మీదట.. ప్రదక్షిణలు చేసి ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక గర్భాలయంలో పంచముఖ శివయ్య కొలువుదీరి కనిపిస్తాడు. ఇక్కడి పంచముఖ శివుడికి ఆలయానికి వెళ్లిన భక్తులు అభిషేకాలు, అర్చనలు జరుపుతారు.

తాళ్లయ్య పాలెం పంచముఖ శివుడి క్షేత్ర విశేషాలేంటంటే..

ఏ ఆలయంలో అయినా నవగ్రహాలు ఒకే మండపంలో వెలసి ఉండడం సర్వసాధారణం. కానీ ఈ ఆలయంలో కాస్త విభిన్నంగా ఉంటుంది. తాళ్లయ్య పాలెం క్షేత్రంలో నవగ్రహాలు ప్రత్యేకంగా ఉన్నాయి. నవగ్రహాలు ఒక్కొక్కటిగా తమ వాహనాలతో సతీసమేతంగా ప్రత్యేక మందిరాలలో కొలువై ఉండడం విశేషం. ఇలా వాహనాలతో సహా నవగ్రహాలు వేటికవే కొలువుదీరి ఉండటమనేది చాలా అరుదు. అంతేకాదు ఇక్కడ నవగ్రహ దోషాలలో ఏ గ్రహ దోషమున్నా ఆ గ్రహానికి సంబంధించిన ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటూ ఉంటారు. అంతేకాదు అక్కడే ఉన్న ‘నక్షత్ర వనం’లో నక్షత్ర పరమైన దోషాలు తొలగించుకునే ఏర్పాట్లు ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version