Site icon Bhakthi TV

ద్రౌపదికి సైతం మన దేశంలో ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

మహాభారతానికి పురాణేతిహాసాల్లో భారతదేశంలో ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారతం ప్రతి హిందువుకి మార్గదర్శిగా పేర్కొంటారు. మహాభారతంలో ద్రౌపదికి ప్రత్యేక స్థానముంది. అయితే ద్రౌపదికి ఆలయాలనేవి చాలా అరుదు. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే.. మన దేశంలో ద్రౌపదికి ఏడు ఆలయాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. ద్రౌపదిని అగ్ని సంజాతగా.. అయోనిజగా పురాణాలు పేర్కొంటున్నాయి. ద్రుపద మహారాజు చేస్తున్న యజ్ఞం నుంచి ఆవిర్భవించిన యాజ్ఞసేన ద్రౌపది.

ద్రౌపదికి సైతం మన దేశంలో ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

పంచభూత స్వరూపాలైన పాండవులను నడిపించే అగ్ని శక్తికి ద్రౌపది సంకేతంగా పేర్కొంటారు. ఈమెకు కృష్ణ అనే పేరు కూడా ఉంది. మహాభారతానికి సూత్రధారులుగా ముగ్గురిని పేర్కొంటారు. వారిలో ద్రౌపది ఒకరు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక సూత్రధారిగా.. మహాభారత గ్రంథాన్ని మరో సూత్రధారిగా చెబుతారు. వ్యాసమహర్షి మహాభారతాన్ిన మానవాళికి అందించాడు. ఇక ద్రౌపదికి సంబంధించిన ఆలయాలు.. ఏపీలోని నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉంది. తమిళనాడులో చెన్నై నగరంలోని వేలాచేరిలో, ఆలందూర్‌, సైదాపేట, మహాబలిపురం, కుంభకోణంలో ద్రౌపదికి ఆలయం ఉంది. ఉత్తరాదిలో ఒక్క ఆలయం కూడా లేదు. ఉన్నవన్నీ దక్షిణాదిలోనే ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version