లలితా సహస్ర నామం గురించి.. దాని ప్రాధాన్యత గురించి హిందువులందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం భక్తులు నిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటారు. అదెక్కడంటే.. తిరుమేయచ్చూరు లలితాంబికా ఆలయం. దీనిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే అనారోగ్యాలు సైతం నయమవుతాయట. ఇక్కడ పరమేశ్వరుడు కొలువుదీరాడు. పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా.. లలితాంబికా దేవి శ్రీచక్రంపై వెలిసి ఉన్నారు. తిరుమీయచ్చూర్ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం.
తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరుమీయాచ్చూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. తిరుమీయచ్చూర్ పుణ్యక్షేత్రంలో శివుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. అలాగే పార్వతీ దేవి శ్రీచక్ర రాజ సింహాసనాన్ని అధిష్టించి దర్శనమిస్తుంది. అమ్మవారు తన అభయ హస్తంతో భక్తులను ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. తమిళ మాసమైన ‘చితిరాయ్’ అంటే మన చైత్ర మాసంలో ఈ ఆలయంలో ఓ విశేషం ఉంటుంది. అదేంటంటే.. సూర్య కిరణాలు నేరుగా ఆలయంలో ప్రవేశించి స్వామివాని పాదాలను స్పృశిస్తాయి. ఈ అరుదైన ఘటన చూడటానికి ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తారు.
