Site icon Bhakthi TV

800 ఏళ్ల నాటి పురాతన ద్రౌపది ఆలయం ఎక్కడుందంటే..

మన దేశంలో ద్రౌపదికి ఏడు ఆలయాలు ఉన్నాయని తెులసుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మూలపేటలో ఒక ఆలయం ఉంది. అలాగే కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలోని నాగరథ పేటలో ఓ ఆలయం ఉంది. ఇది అత్యంత పురాతన ఆలయం. 800 ఏళ్లనాటిదని చెబుతారు. ఈ ఆలయంలో పంచ పాండవులతో పాటు ద్రౌపది కూడా కొలువుదీరింది. దీనిని దర్మరాయ ఆలయమని పిలుస్తారు. ఇవి రెండు కాగా.. ఒక్క తమిళనాడులోనే ద్రౌపదికి ఐదు ఆలయాలున్నాయి.

800 ఏళ్ల నాటి పురాతన ద్రౌపది ఆలయం ఎక్కడుందంటే..

చెన్నైలోని వేలాచేరిలో ఒక ఆలయం ఉంది. ఇక్కడి విశేషమేంటంటే.. వేలాచేరి గ్రామదేవతగా ద్రౌపది పూజలందుకుంటోంది. చెన్నైలోని ఆలందూర్‌ సైదాపేట, కుంభకోణం, మహాబలిపురంలలో ద్రౌపదికి ఆలయాలున్నాయి. మొత్తంగా ఏడు ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఈ ఆలయాల్లోని ద్రౌపదిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటారు. ఈ ఆలయాలన్నీ కూడా పెద్దగా ప్రఖ్యాతి అయితే చెందలేదు కానీ ద్రౌపది ఆలయాలు చాలా అరుదు కాబట్టి వీటి తెలిసిన వారు మాత్రం తప్పక వెళ్లి దర్శించుకుంటారు. సింగపుర్, మలేషియా, శ్రీలంక, మారిషస్ వంటి ప్రాంతాల్లో ద్రౌపది ఆలయాలున్నాయి.

Share this post with your friends
Exit mobile version