Site icon Bhakthi TV

దంపత పూజ ఎలా చేయాలంటే..

ఇంట్లో శుభకార్యాలు ఎలాంటి అడ్డంకి లేకుండా జరగడం కోసం 11 శనివారాల పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పూజించుకోవాలి. అనంతరం అంటే 11 శనివారాలు పూర్తయ్యాక చివరి శనివారం రోజు దంపత పూజ చేయాలి. దీనికి ఎవరినైనా దంపతులను మీ ఇంటికి ఆహ్వానించాలి. వారు రాగానే పాద పూజ చేసి, భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఆ దంపతులను శ్రీలక్ష్మి నరసింహస్వామి దంపతులుగానే భావించి అతిథి సత్కారాలు చేయాల్సి ఉంటుంది. వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.

దంపత పూజ ఎలా చేయాలంటే..

ఈ పూజ సమయంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం వీలు కాని వారు 11 శనివారాలు పూర్తయ్యాక ఒకసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించి క్షేత్రంలో నిద్రించడం మంచిది. ఈ విధంగా శ్రీలక్ష్మి నరసింహ స్వామివారిని 11 శనివారాల పాటు పూజించిన మీదట ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా కూడా తొలగుతాయట. వివాహం ఆలస్యం అవుతున్న వారికి వెంటనే వివాహ తంతు ప్రారంభమవుతుందట. అలాగే ఇల్లు కట్టడంలో ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయట. కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని కూడా చెబుతారు.

Share this post with your friends
Exit mobile version