Site icon Bhakthi TV

ధన్వంతరి ఎవరు? దీపావళికి ముందు ఎందుకు పూజిస్తారు?

ఆయుర్వేదం అనేది నిన్ననో మొన్ననో సడెన్‌గా పుట్టుకొచ్చింది కాదు.. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం అందుబాటులో ఉంది. ఎందరో ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేసి పట్టు సాధించారు. దీనికి మూల పురుషుడిగా ధన్వంతరిని పేర్కొంటారు. మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని ధన్వంతరియే చెబుతారని అంటారు. ఆయుర్వేదాన్ని కనిపెట్టిన ధన్వంతరి ఎవరు? అనేది తెలిస్తే చాలా విషయాలు అవగతమవుతాయి. వైద్య దేవుడిగా మనకు తెలిసిన ధన్వంతరి మరెవరో కాదు.. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ఈ విషయాన్ని చెబుతోంది.

అసలు ధన్వంతరి ఎవరి వద్ద ఆయుర్వేదం నేర్చుకున్నాడో తెలుసా? ఆరోగ్యాన్ని ప్రసాదించే సాక్షాత్తు సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సూర్యుడి 16 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ధన్వంతరి ఒకడని చెబుతారు. అలాంటి ధన్వంతిరిన దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున పూజించుకోవడం ఆనవాయితీ. ఇలా పూజించుకుంటే.. ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు, సంపద కలుగుతాయని నమ్మకం. అక్టోబర్ 18, శనివారం సాయంత్రం కానీ, 19, ఆదివారం ఉదయం కానీ ధన్వంతరిని పూజించుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version