Site icon Bhakthi TV

బీష్మాష్టమి నాడు ఏం చేస్తారంటే..

భీష్మాష్టమి అనేది భీష్మ పితామహుని స్మరణతో జీవితం పవిత్రమయ్యే శుభతిథి అని చెప్పుకున్నాం కదా. నిత్యకర్మలు, ఆచమనం, ప్రాణాయామం తరువాత చెప్పుకునే సంకల్పం. యజ్ఞోపవీతం అపసవ్యం చేసి దక్షిణ దిక్కుకు తిరిగి తిల–జల తర్పణం వదులుతారు. భీష్ముని స్మరిస్తూ శ్లోకాలతో తర్పణం వదులుతారు. తరువాత ఉపవీతం సవ్యంగా చేసి తూర్పు దిక్కున అర్ఘ్య ప్రదానం చేస్తారు. పూర్తిగా చేయలేని వారు కనీసం మూడు సార్లు దోసిలితో నీటిని విడుస్తూ భీష్మ శ్లోకాలను చదివినా ఫలితం కలుగుతుంది.

భీష్మునికి అర్ఘ్య శ్లోకం

భీష్మః శాన్తనవో వీరః సత్యవాది జితేంద్రియః ।
ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ ॥

భీష్ముడి విశిష్టత ఏంటంటే.. భగవాన్ శ్రీకృష్ణుడు నిత్యం స్మరించిన మహాభక్తుడు భీష్ముడు. “నేను స్మరిస్తున్నది నా భక్తుడు భీష్ముడు” అని కృష్ణుడు స్వయంగా అన్న మహానుభావుడు. త్యాగంలో, ధర్మంలో, భక్తిలో భీష్మునికి సాటి భీష్ముడే. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించినవాడు, విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించిన జ్ఞానసాగరం.

Share this post with your friends
Exit mobile version