
ప్రదోషం రోజున శివపార్వతులను పూజిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయని శివపురాణం, లింగ పురాణాలలో వివరించారని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా భౌమ ప్రదోషం రోజున శివుడిని పూజిస్తే కోటి రెట్ల ఫలితం అధికంగా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున శుచిగా స్నానమాచరించి శివపార్వతులను మల్లెపూలతో పూజిస్తారు. ఉండగలిగిన వారు సాయంత్రం వరకూ ఉపవాసం ఉంటారు. ఇక ప్రదోషం కాబట్టి సాయంకాలం పూట శివుడిని పూజించుకుంటారు. అయితే ముఖ్యంగా చేయవల్సిన పనేంటంటే.. తప్పనిసరిగా శివాష్టకం విధిగా పఠించాల్సి ఉంటుంది.
ఈ రోజు భౌమ ప్రదోష కాబట్టి సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. అనంతరం శివయ్యకు ఆలయంలో అర్చన నిర్వమించాలి. ఆ తరువాత కొబ్బరికాయ కొట్టి.. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష కథను చదవడమో.. వినడమో చేసి హారతి ఇవ్వాలి. ఇక చివరిగా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే పూజ పూర్తైనట్టే. ఆ తరువాత ఆలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.
