
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడపలో హనుమంతుడి ఆలయాన్ని స్వయంగా ఆదేశించి నిర్మింపజేసుకున్నాడట. ఆళ్లగడపలో ఈ ప్రాచీన కాలం నాటి అభయాంజనేయస్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆంజనేయుడు చాలా క్రితం ఆళ్లగడపలోని ఓ వ్యక్తికి కలలో కనిపించి తన ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో ఆ గ్రామస్తుడు మిగిలిన గ్రామంలోని వారందరికీ చెప్పి ఆలయాన్ని నిర్మించాడట. అందువలన స్వామివారు తమ గ్రామంలో ప్రత్యక్షంగా ఉన్నాడని ఆ గ్రామస్తుల నమ్మకం. తమ గ్రామాన్నే కాకుండా, పాడి పంటలను సైతం స్వామి రక్షిస్తాడని వారి విశ్వాసం.
ఏదైనా పని మీద గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఈ గ్రామస్తులు ఆంజనేయస్వామికి మొక్కి వెళతారు. పని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుంటారు. ఈ ఆలయంలో త్రికాలాలో నిత్య కైంకర్యాలు నిర్వహిసత్ారు. అలాగే ప్రతి మంగళ, శనివారాల్లో స్వామివారికి విశేషంగా ఆకుపూజ, సింధూర పూజ, వడమాల, అప్పల మాల వంటి ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ వంటివి విశేషంగా జరుగుతాయి. అలాగే ఏడాదిలో రెండుసార్లు వచ్చే హనుమాన్ జయంతి ఉత్సవాలు, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
