Site icon Bhakthi TV

శివయ్య కోసం పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసిందట..

దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఆధ్యాత్మికంగా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ ఎన్నో అతి ప్రాచీన లయాలున్నాయి. తమిళనాడు ప్రజలు ఎక్కువగా ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిలో భాగంగా వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. ముఖ్యంగా తమిళనాడులో అతి ప్రాచీనమైన స్వయంభువు ఆలయాలు ఎక్కువ. వాటిలో ఒక ప్రాచీన శివాలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ శివాలయం ఉంది. చెన్నైలోని మైలాపూర్ అరుల్మిగు కపాలీశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు.

సాక్షాత్తు జగన్మాత సైతం ఇక్కడ పరమేశ్వరుని కోసం ఈ ప్రదేశంలోనే తపస్సు చేసిందట. అనంతరం కర్పగవల్లిగా పరమేశ్వరుని సతిగా ఇక్కడ వెలిసింది. కైలాసం నుంచి సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు మైలాపూర్‌కు వచ్చి వెలిశారు కాబట్టి వారిని ఇక్కడ మైలేయే కైలై, కైలేయే మైలై అంటారు. అందుకే ఇక్కడ మైలాపూరే కైలాసం.. కైలాసమే మైలాపూర్ అని చెబుతారు. ఇక్కడ శివయ్య కోసం జగన్మాత పార్వతీదేవి తపస్సు చేసిందని తెలుసుకున్నాం కదా. ఈ క్షేత్రంలో నెమలి రూపం దాల్చి పార్వతీదేవి తపస్సు చేసిందని చెబుతారు. తమిళంలో మొయిలీ అంటే నెమలి అనే అర్థం కాబట్టి ఈ క్షేత్రానికి మైలాపూర్ అనే పేరు వచ్చింది.

Share this post with your friends
Exit mobile version