Site icon Bhakthi TV

కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు ఎలా వెలిగించాలి?

కార్తీక మాసంలో శివాలయంతో పాటు విష్ణు ఆలయంలోనూ దీపాలు వెలిగిస్తుంటారు. శివాలయంలో దీపాలు వెలిగించే పద్ధతి తెలుసుకున్నాం. ఇప్పుడు విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించే పద్ధతి తెలుసుకుందాం. కార్తిక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధివిధానం పాటించాలని పండితులు చెబుతారు. దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి.

ఒకవేళ అవిసె పుష్పాలు అందుబాటులో లేకపోతే తమలపాకులను తీసుకుని వాటిలో కొద్దిగా నువ్వులు లేదా బియ్యం, ధాన్యం నైవేద్యంగా ఉంచి దీపం వద్ద పెట్టాలి. ఇటువంటి దీపాన్ని ‘నందా దీపం’ అని అంటారు. ఈ దీపం చాలా శక్తి వంతమైనదట. మనకు వీలైనంత పెద్ద ప్రమిదలో దీపం వెలిగించాలట. అలా వెలిగించాక దీపం వెంటనే కొండెక్కకుండా చూసుకుంటే మంచిదట. నందా దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. విష్ణుమూర్తి ఆలయంలోనే కాదు.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధితమైన ఏ ఆలయంలోనైనా ఇలాగే నందా దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version