Site icon Bhakthi TV

ఇక్కడ నవరాత్రుల్లో దుర్గమ్మకు మటన్, చేపలే నైవేద్యం..కారణమేంటంటే..

దుర్గమ్మ పూజ అంటేనే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చాలా నిష్టగా ఉండాల్సి వస్తుందని ఎక్కువగా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించరు. నవరాత్రులన్ని రోజులు మాంసాహారాన్ని ముట్టరు. సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అలాంటిది ఏకంగా అమ్మవారికే ఓ చోట చేపలు, మటన్‌తో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా పెడతారు. అది మరెక్కడో కాదు.. బెంగాల్‌లో.. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో దుర్గమ్మను పూజించే విధానం వేరుగా ఉంటుంది. దుర్గమ్మను పెద్ద ఎత్తున కొలిచే ఈ ప్రాంతంలో అమ్మవారికి నాన్ వెజ్ వంటకాలను సమర్పించడమేంటనేది విచిత్రంగా అనిపించవచ్చు.

దానికి పెద్ద కారణమంటూ ఏమీ లేదు. బెంగాల్ వాసులు దుర్గమ్మను తమ కూతురిగా భావిస్తారు. అయితే కూతురు పుట్టింటికి వచ్చిన సమయంలో ఎలాగైతే చేపలు, మటన్‌తో విందు భోజనం పెడతారో అలాగే ఇక్కడి అమ్మవారికి కూడా పెడతారు. దీనిని ‘నిరామిష్ మాంగ్షో’ లేదంటే నిరామిష్ మటన్ అంటారు. ఇది మినహా మిగిలిన సంప్రదాయాలన్నీ సహజంగానే సాగుతుంటాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ఈ నవరాత్రుల సమయంలో భక్తులను ఆశీర్వదించేందుకు ఏకంగా అమ్మవారే భూమి మీదకు వస్తుందని భక్తులు చెబుతారు.

Share this post with your friends
Exit mobile version