Site icon Bhakthi TV

ఈ శమీ వృక్షం చుట్టూ ఈ శ్లోకం స్మరిస్తూ ప్రదక్షిణ చేయండి..

పాలసముద్ర మథనంలో అమృతం వెలిసిన శుభముహూర్తం ఈ విజయదశమి రోజే. శ్రవణా నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ శుక్ల దశమి “విజయదశమి”. ఈరోజు ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుంది అని చతుర్వర్గ చింతామణి గ్రంథం తెలిపింది. శమీపూజ ఈరోజు ప్రత్యేకం. జమ్మిచెట్టు (శమీవృక్షం) పాండవులకు అపరాజితా దేవి రూపంలో విజయాన్ని ఇచ్చింది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి రావణాసురునిపై విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసే ఆచారం కూడా ఉంది.

ఈ రోజు సాయంత్రం శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కింద శ్లోకాన్ని స్మరించాలి.

శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

శ్లోకం రాసిన చిట్టీని చెట్టు కొమ్మకు కట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది శనిదోష నివారణకు కూడా ప్రయోజనం ఇస్తుందని విశ్వాసం.

Share this post with your friends
Exit mobile version