Site icon Bhakthi TV

యమ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి?

దసరా నవరాత్రులు అయితే ముగిశాయి. ఇక రానున్నది దీపావళి. ఈ పండుగను మన దగ్గర అయితే మూడు రోజులు జరుపుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగలో తొలి రోజును ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షం లేదంటే కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమ దీపం వెలిగిస్తారు. అసలు యమ దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనం ఏంటి? అంటే.. యమధర్మరాజు పేరుతో దీపం వెలిగిస్తే యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. మరి చీకటి పక్షం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం.

యమ దీపం వెలిగించడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయట. తద్వారా ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి ఎప్పుడనేది తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి ఈ ఏడాది అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం. కానీ దీనిని మాత్రం అక్టోబర్ 18న శనివారం జరుపుకోనున్నాం. ఈ రోజునే ధన త్రయోదశి అలాగే మనం యమ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version