
రాజస్థాన్‌లోని పెద్ద జిల్లాలలో ఒకటైన బార్మర్‌లో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ రాష్ట్రం పశ్చిమ భాగంలో ఉన్నందున, ఇది థార్ ఎడారిలో కొంత భాగాన్ని కలిగి ఉండటమే కాకుండా పశ్చిమాన పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రత 51 °C వరకూ పెరుగుతుండగా.. శీతాకాలంలో 0 °C వరకూ పడిపోతుంది. ఈ జిల్లాలో పర్యాటక ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటిలో ొకటైన బార్మర్ ఫోర్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బార్మర్ ఫోర్ట్‌నే గర్ దేవాలయమని కూడా పిలుస్తారు. రావత్ భీమా 1552 ఏడీలో ప్రస్తుత బార్మర్ నగరంలోని కొండ వద్ద బార్మర్ కోటను నిర్మించాడు. దీనిని బార్మర్ గర్ అని కూడా పిలుస్తారు. ఈ కోటను ఒక ఎత్తైన కొండపై నిర్మించడం జరిగింది. 1383 అడుగుల కొండపై 676 అడుగుల ఎత్తులో కోటను నిర్మించాడు.బార్మర్ కోట కొండ ఒకటి కాదు. రెండు ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలకు నెలవు. కొండ పైభాగంలో 1383 ఎత్తులో ఉన్న జోగ్మయా దేవి (గర్ మందిర్) ఆలయం.. 500 అడుగుల ఎత్తులో నాగ్నేచి మాత ఆలయం ఉంటుంది. ఈ రెండు ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి.
