వ్యాపారంలో లాభదాయక ఫలితాలు ఉంటాయి. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి.
శ్లోక పారాయణలు కొనసాగించండి.
ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో సంయమనం అవసరం.
సూర్యారాధనతో పాటు రవి, కుజ శ్లోకాలు పఠించండి.
మనోధైర్యంతో చేసే పనులు శుభాన్నిస్తాయి. సమస్యల పరిష్కారానికి కార్యాచరణతో సత్ఫలితాలు పొందుతారు.
కుజ, బుధ శ్లోకాలు పఠిస్తే మేలు కలుగుతుంది.
గ్రహయోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
సూర్య, కుజ శ్లోకాలు పఠించండి.
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కొంత బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది.
నవగ్రహ ధ్యానం మంచిది.
ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అభిష్టాలు నెరవేరతాయి. మీ మీ రంగాల్లో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
రవి, బుధ, కుజ శ్లోకాలు పఠించండి.
ఇంట్లో శుభకార్య యోగం. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణ సానుకూలతలుంటాయి. అనవసరమైన అంశాల జోలికి వెళ్లకండి.
రవి, కుజ ధ్యానం చేయండి.
శక్తికి మించిన పనులు చేయవద్దు. పంతాలకు దూరంగా ఉండండి. పట్టుదలతో శ్రమించాలి.
రవి, కుజ, బుధ, శుక్ర శ్లోకాలు పఠించండి.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. గ్రహయోగం బాగుంది. భూ వాహన కొనుగోలు చేస్తారు.
రవి, బుధ ధ్యాన శ్లోకం పఠించండి.
మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు, అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవకాశాలు అందిపుచ్చుకోండి.
సూర్య, కుజ శ్లోక పఠనం మేలు.
గ్రహబలం నామమాత్రం. మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం. కోపాన్ని తగ్గించుకోకపోతే అవకాశాలు చేజారతాయి.
ఇష్టదేవతారాధన చేసుకోండి.