అనుకూల గ్రహబలం. వస్త్రధాన్య లాభాలు. లక్ష్యసాధనలో అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు. శుక్ర ధ్యాన శ్లోకం పఠించండి.

స్వల్ప గ్రహబలం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మరిన్ని శుభాలకు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమయపాలన పాటించండి. ప్రయాణాల్లో జాగ్రత్త. రవి, కుజ ధ్యాన శ్లోకాలు పఠించండి.

అనుకున్న కార్యాలు నెరవేరతాయి. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ఆర్థికంగా ప్రయోజనాలున్నా ఖర్చులు నియంత్రణ తప్పనిసరి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. సూర్యారాధన శుభప్రదం.

వృత్తివ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. మంచి జరుగుతుంది. రవి, బుధ, కుజ స్మరణ మరింత మేలు చేస్తుంది.

మిశ్రమ కాలం. స్వల్ప గ్రహబలం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. రవి, కుజ ధ్యాన శ్లోకాలు పఠిస్తే సానుకూలతలు పెరుగుతాయి.

స్వల్ప అనుకూల గ్రహబలాలు. మేలైనా ఫలితాలున్నాయి. దైవబలం కాపాడుతుంది. ఆర్థికంగా ప్రయజనాలు. కుజ శుక్ర శ్లోకాలు పఠించండి.

ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. మొహమాటాలతో సమస్యలొస్తాయి. కుజ, బుధ శ్లోకాల పఠనంతో శుభం.

శ్రమతో కూడిన విజయాలు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా సత్ఫలితాలున్నాయి. రవి, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.

ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. నిదానంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. రవి, కుజ, బుధ శ్లోకాలు పఠిస్తే మేలు.

మిశ్రమ కాలం. చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. మాట విలువను కాపాడుకోవాలి. విష్ణు సహస్రనామస్తోత్రం పారాయణ చేయండి.