ధనలాభం. మంచి ఆరోగ్యం ఉంటుంది. సుఖసంతోషాలు కలుగుతాయి. మరిన్ని శుభాలకు రవి, కుజ శ్లోకాలు పఠించండి.

ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.

మిశ్రమ కాలం నడుస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. సవగ్రహ ఆరాధనతో మరిన్ని శుభాలు.

వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుజ స్తోత్రం పఠించండి. దుర్గాలయం దర్శించండి.

ఆర్థికపరమైన జాగ్రత్తలు అత్యంత అవసరం. వృధా ఖర్చులు చేయవద్దు. కొత్త పరిచయాలు మేలు చేస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ఆర్థికంగా మంచి ప్రయోజనాలు. వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. రవి, కుజ, బుధ శ్లోకాలు వరించండి.

ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొహమాటాలతో ఇబ్బందులు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

అర్థికపరంగా అనుకూలం. నెల చివర్లో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠిస్తే మేలు.

ఆర్థికంగా బలపడతారు. అప్పులకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు శుభకాలం నడుస్తోంది. కుజ, శుక్ర ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

మీ మీ రంగాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. హనుమంతుని ఆరాధించండి.

సంయమనంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. గృహ - వాహన మార్పులకు ప్రయత్నిస్తారు. సూర్యారాధన మేలు చేస్తుంది.

ఇబ్బందులు అధిగమిస్తారు. డబ్బు పొదుపే కాదు... మాట పొదుపు పాటించండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి.