ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి, కుజ, బుధ శ్లోకాలు తో మరింత మేలు కలుగుతుంది.

ఆశించిన ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచి పేరుప్రతిష్టలు లభిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి. దుర్గాదేవిని దర్శించండి. కుజ శ్లోకం పఠించండి.

ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తి ప్రదర్శించండి. నెల చివర్లో తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ధనలాభం ఉంది. కుటుంబసౌఖ్యం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. నెల చివర్లో వత్తిళ్లు ఉంటాయి. సూర్యారాధన చేయండి.

ఆర్థికంగా కలిసివస్తుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నవగ్రహ ధ్యానంతో శుభాలు కలుగుతాయి.

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుజ, బుధ, శుక్ర శ్లోక పఠనం శుభప్రదం.

సంతానపరమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుజ శ్లోక పఠనం మేలు.

స్వల్ప గ్రహబలం. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను అధిగమించాలి. శ్రీరామ నామస్మరణ చేయండి.

విజయాన్ని అందుకుంటారు. అనవసర విషయాలను పెద్దవి చేసి చూడవద్దు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. రవి, కుజ, బుధ శ్లోకాలు పఠించండి.

అంత అనుకూలమైన సమయం కాదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోండి. ఒక వార్త మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

స్వల్ప గ్రహబలం. కష్టేఫలి అన్న విధంగా ఫలితాలు ఉంటాయి. మీ నిర్ణయాలను శ్రేయోభిలాషులు ఆమోదిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.