భక్తి టీవీ దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన కోటిదీపోత్సవం నేడు పదకొండో రోజుకు చేరుకుంది.. ఏటా కార్తిక మాసంలో నిర్వహించే ఈ దీప యజ్ఞంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. పీఠాధిపతుల అనుగ్రహ భాషణం, అతిరథ మహారథులు అతిథులుగా తరలివస్తున్నారు. ఇక, రోజురోజుకి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది..
11వ రోజు కోటిదీపోత్సవం కార్యక్రమాలు
* ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీపరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం
* హైదరాబాద్ జగన్నాథ మఠం శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం
* పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం
* వేదికపై కొల్హాపూర్ మహాలక్ష్మీకి కోటి కుంకుమార్చన
* భక్తులచే లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన
* యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
* స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ
* మహాదేవుని నీరాజనాలు
* కోటి దీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అయ్యే కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సింది భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామాగ్రి, దీపారాధన వస్తువులను ఎన్టీవీ, భక్తి టీవీ యాజమాన్యం ఉచితంగా అందిస్తోన్న విషయం విదితమే..