భారతదేశంలో ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాల్లో సైన్స్‌కు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో బెహతా గ్రామంలో ఉన్న జగన్నాథ్ ఆలయం ఒకటి. మరి ఈ ఆలయంలో అద్భుతం ఏం జరుగుతుంది అంటారా? ఈ ఆలయం వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేసి మనకు చెబుతుందట. అంటే రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుంది? తక్కువ వర్షపాతం ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? వంటి అంశాలన్నీ చెబుతుందట. అందుకే ఈ జగన్నాథుని ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని కూడా పిలుస్తారట. మరి ఎలా చెబుతుంది? ఏమా కథ చూద్దాం.
వర్షం లేదా రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభమైంది. ఈ చుక్కల సైజును బట్టి ఆ ఏడాది రుతుపవనాలు బలంగా ఉంటాయా? బలహీనంగా ఉంటాయా? అనేది అంచనా వేస్తారు. తద్వారా ఆ ఏడాది ఎక్కువగా వర్షాలు కురుస్తాయా? లేదంటే తక్కువ వర్షాలు కురుస్తాయా? అనేది అంచనా వేస్తారట. జూన్ నెల ఫస్ట్ హాఫ్‌లో ఆలయ గర్భగుడి నుంచి చుక్కలు పడటం ప్రారంభమవుతుందట. ప్రస్తుతం గోపురం మీద ఉన్న రాయి నుంచి మంచి పరిమాణంలో చుక్కలు పడుతున్నాయని తెలిపారు. ఈ ఆలయంలో జగన్నాథుని 15 అడుగులు నల్లరాతి విగ్రహంతో పాటు ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలున్నాయి.