అసలు గుడికి ఎందుకు వెళ్లాలి?

గుడికి వెళితే మంచి జరుగుతుందంటారు. ఎలాంటి కష్టాల నుంచి అయినా గట్టెక్కుతాం అంటారు. దీనిలో నిజమెంత? ముందుగా గుడికి వెళితే ఏం జరుగుతుందో తెలిస్తే మన ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుంది. గుడి అనేది గొప్ప అయస్కాంత క్షేత్రం. ఇది చాలా పవిత్రంగా నిర్మించబడుతుంది. ఎక్కడైతే అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుడు వెలిశాడని.. స్వయంభూ దేవాలయాలని నిర్మాణం చేయడం జరుగుతుందట. ఎక్కడపడితే అక్కడ దేవాలయాలు కట్టరు. ఎక్కువగా అయస్కాంత శక్తి ఉండే చోటును ఎంచుకుని.. ముఖ్యంగా దాని కేంద్ర స్థానం ఎంచుకుని మూల విరాట్టును ప్రతిష్టాపిస్తారు.

ఆ మూల విరాట్టు కింద రాగి రేకు మీద యంత్రాలు.. వాటిపై బీజాక్షరాలు రాసి ప్రతిష్టింపజేస్తారు. రాగి మంచి విద్యుత్ వాహిక. అలాంటి రాగి రేకుపై గీతలను ఒంపుగా గీస్తే.. వాటి మధ్య శక్తి కేంద్రీకృతమవుతుందట. ఇలా చేయడం వలన అక్కడి శక్తంతా అక్కడ కేంద్రీకృతమవుతుంది. దీంతో పాటు మంత్రాలతో ప్రతిష్టింపజేస్తారు కాబట్టి ఆ పరిసరాల్లో ఉండే శక్తంతా అక్కడ కేంద్రీకృతమవుతుందట. అటువంటి శక్తి క్షేత్రంలోకి వెళితే మన శరీరం కూడా ఆ శక్తిని కొంత గ్రహిస్తుందట. కాబట్టి దేవాలయానికి వెళితే కొంత శక్తి మనకు వస్తుందట. కష్టాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందట. అప్పుడు సమస్యను జయించడానికి వీలవుతుందట. కాబట్టి గుడికి వెళితే మంచి జరిగే మార్గం దొరుకుతుందట.

Share this post with your friends