శ్రీరాముడు సముద్రంపై సేతువును ఎందుకు నిర్మించాల్సి వచ్చింది?

రావణుడు.. సీతమ్మను చెరబట్టి లంకకు తీసుకెళ్లిన కథ మొత్తం మనకు తెలుసు. అయితే రాముల వారు సముద్రంపై సేతువుని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న కథేంటనేది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీరాముడు లంకకు వెళ్లి సీతమ్మ వారిని తీసుకు రావాలంటే ముందుగా సముద్రం దాటాలి. అదెలా దాటాలో శ్రీరామ చంద్రుడికి అర్ధం కాలేదట. అప్పుడు ఆ మహానుభావుడు విభీషణుడిని ఏం చేస్తే సముద్రం మనకు దారిస్తుందని అడిగాడట. దీనికి విభీషణుడు రాముడు శరణాగతి చేస్తే ఇస్తుందని చెప్పాడట. దీంతో శ్రీరామ చంద్రుడు వచ్చి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడట.

మూడు రాత్రులు గడుస్తున్నా సముద్రుడు రాడే.. దీంతో రాముడికి పట్టరాని కోపం వచ్చింది. లక్ష్మణుడితో పౌరుషాన్ని ప్రకటించక మంచితనానికి వెళితే ఇలాగే చేతకానివాడిగా చూస్తారని చెబుతాడట. తన బ్రహ్మాస్త్రంలో సముద్రాన్ని ఎండబెడతానని.. జలచరాలన్నింటినీ హతమారుస్తానని చెప్పాడట. చెప్పిందే తడవుగా కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని సంధించబోతుండగా.. అప్పుడు సముద్రుడు ప్రత్యేక్షమయ్యాడట. పంచభూతములకు ఉన్న స్వభావమే తనకు ఉందని.. సముద్రమంటే లోతుగానూ.. అగాధంగానే ఉండాలని కాబట్టి తాను దారివ్వలేనని.. అయితే తనపై సేతువుని నిర్మించుకోవాలని చెప్పాడట. అలాగే సముద్రంలోని జలచరాలన్నీ ఎవ్వరినీ ఏమీ చేయకుండా తాను చూసుకుంటానని తెలిపారట. ఆ తరువాత విశ్వకర్మ, వానరుల సాయంతో శ్రీరామ చంద్రుడు సేతువుని నిర్మించాడు.

Share this post with your friends