చాణూర ముష్టికులు ఎవరు? శ్రీకృష్ణుడు వారినెందుకు సంహరించాడు?

చాణూర ముష్టికుల గురించి ఎప్పుడైనా విన్నారా? వీరి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. చాణూర ముష్టికులు కంసరాజుకు నమ్మిన బంటులు.. సందర్భం ఏదైనా ఆయన వెనుకే ఉండేవారు. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి కంసుడి వద్దకు వెళ్లాడు. వారిని చూసిన వెంటనే చాణూరుడు ఇప్పటి వరకూ జరిగిన వాటిని బట్టి నువ్వు చిన్నవాడివని అయితే భావించడం లేదు. కాబట్టి మా మల్లయుద్ధ విశారదులతో తలపడమన్నాడు. అప్పుడు కృష్ణుడు వాళ్లూ, వీళ్లు ఎందుకు నీతోనే తలపడతానన్నాడు. చాణూరుడు ముందుగా చెలరేగిపోయాడు. దీంతో శ్రీకృష్ణుడు తన లీలామానుష స్వరూపాన్ని ప్రదర్శించాడు. హోరాహోరీ పోరు జరిగింది.

శ్రీకృష్ణుడు, బలరాముడి ధాటికి చాణూర ముష్టికులు తాళలేకపోయారు. ఒక్కొక్కరూ నెత్తూరు కక్కుకుంటూ మరణించారు. అసలీ చాణూర ముష్టికుల కథేంటంటే.. అమరావతీపురంలో ఉతధ్యుడనే ఒక మహర్షి కమారులు. మంచి సౌందర్యంతో ఉండేవారు కానీ వీరికి విద్యాబుద్ధులు మాత్రం అబ్బలేదు. పైగా గొడవంటే చాలు ఒంటి కాలిపై లేచేవారు. కొడుకుల ప్రవర్తనకు బాధపడిన ఉతద్యుడు వారిని దారిలో పెట్టాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒకసారి ఉతద్యుడు ఆగ్రహంతో వారిని రాక్షసులై పుట్టి, మల్లయోధులుగా చరిస్తారని శపించాడు. తండ్రి శాప ఫలితంగానే వారంతా చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు అనే అసురులుగా పుట్టి కంసుని కొలువులో చేరారు. చివరకు శ్రీకృష్ణుడి చేతిలో పడి శాప విముక్తి పొందారు.

Share this post with your friends