ఏ ఏ దేవుడి పూజకు ఏ సమయం అనుకూలం?

ఏ దేవుడినైనా ఫలానా సమయంలోనూ పూజించాలన్న నిబంధన అంటూ ఏమీ లేదు కానీ కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయి.. అవేంటో చూద్దాం. సూర్య భగవానుడిని అయితే ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య పూజిస్తే మందిచదట. ఈ సమయంలో పూజ మరో ఇద్దరు దేవుళ్లకు కూడా చాలా ఇష్టమట. ఆ ఇద్దరు ఎవరంటే.. శ్రీరాముడు, శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఆ తరువాత సమయం మహా శివుడిది. ఈయనను ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకూ పూజిస్తే మంచి ఫలితం దక్కుతుందట. ఇక ఆంజనేస్వామికి మధ్యాహ్నం పూజ ఇష్టమట.

ఆంజనేస్వామిని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయట. ఇక రాహువునకు అయితే మధ్యాహ్నం 3 గంటలకు అనువైన సమయం. ఇక శివుడికి ఉదయమే కాదండోయ్ సాయంకాల వేళ కూడా మంచి తరుణమే. శివుడిని సాయంత్రం ఆరు గంటలకు అంటే సూర్యాస్తమయ సమయంలో పూజించుకుంటే చాలా మంచిదట. లక్ష్మీదేవి పూజకు అయితే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ అనువైన సమయమట. ఇక విష్ణు మూర్తిని తెల్లవారు జామున మూడు గంటలకు పూజించాలట. అలా చేస్తే ఆయన దయ మనపై పుష్కలంగా ఉంటుందట. ఇవన్నీ కాదు.. నాకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పూజించుకుంటానన్నా ఓకే..

Share this post with your friends