అసలు గురువాయూరు చిన్ని కృష్ణుడి కథేంటి?

గురువాయూరు చిన్ని కృష్ణుడి ఆలయం దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ ఆలయంలోకి సంప్రదాయ దుస్తులతో వస్తే మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలోని కృష్ణయ్యకు భక్తితో మొక్కి తమకు ఏదైనా వ్యాధి ఉంటే దాని గురించి చెబితే చాలట. ఎంత మొండి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని నమ్మకం. అసలు ఈ ఆలయం వెనుకున్న ఆసక్తికరమైన కథ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ ఆలయం 5 వేల ఏళ్ల నాటిది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వారక నుంచి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి స్వామివారిని భక్తులంతా గురువాయురప్ప అని పిలుచుకుంటూ ఉంటారు.

ఇక ఈ ఆలయ కథేంటో చూద్దాం. మహాభారత యుద్ధం ముగిసిన చాలా కాలానికి శ్రీకృష్ణుడు అక్కడి వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి తన అవతారాన్ని చాలించాడు. ద్వారకలో పెద్ద ప్రళయం వచ్చి ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఆ సమయంలో ఓ చిన్ని కృష్ణుడి విగ్రహం సముద్రపు నీటిలో తేలియాడుతూ బృహస్పతి కంట పడిందట. ఆయన వాయువుతో కలిసి కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారట. బృహస్పతి అంటే గురువు.. వాయువుతో కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు కాబట్టి గురువాయూర్ అని ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. శ్రీకృష్ణుడిని తండ్రిలా భావిస్తారు కాబట్టి అక్కడి కృష్ణయ్యను గురువాయురప్ప అని పిలుస్తారు. ఆ తరువాత గురువు, వాయువు ఆలయ నిర్మాణ బాధ్యతలను విశ్వకర్మకు అప్పగించగా.. ఆ అద్భుత ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతోంది.

Share this post with your friends