కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇక సోమవారం ఉదయం శ్రీ కోదండరామస్వామి అలంకారంలో అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇక ఇవాళ సాయంత్రం స్వామివారు గజ వాహనంపై ఊరేగనున్నారు.ఈ నెల 6వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆ రోజున ఉదయం స్వామివారికి చక్రస్నానం… సాయంత్రం నిర్వహించనున్న ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా , కార్వేటినగరంలో శ్రీ వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడి గర్భగుడిలో స్వామివారు రుక్మిణి, సత్యభామ సమైతుడై కొలువుదీరారు. ఈ విగ్రహాలు నారాయణవనం ఆలయం నుంచి తీసుకువచ్చారు. ఈ ఆలయంలోనే సీతారాములతో పాటు లక్ష్మణ, ఆంజనేయ, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మ ఉపవిగ్రహాలు ఉన్నాయి.