ఇవాళ యోగిని ఏకాదశి.. ఏ దేవుడికి పూజ చేయాలంటే..

యోగిని ఏకాదశి గురించి చాలా మందికి తెలియదు. ఈరోజున యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఎలాంటి సమస్య అయినా నెరవేరుతుందని నమ్మకం. యోగిని ఏకాదశి మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆచరించవచ్చు. ఇవాళే యోగిని ఏకాదశి. ఇవాళ లక్ష్మీనారాయణుల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల విగ్రహాలను గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పూలను, తులసీ దళాలను స్వామివారికి సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. అలాగే చక్కర పొంగలిని ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఇక ఇంట్లో పూజానంతరం వేంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఇవాళ చేసే దానాలకు కూడా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం చేస్తే నారాయణుడు మరింత సంతృప్తి చెందుతాడట. ఇక సాయంత్రం కూడా శుచిగా స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలా మంచిదట. జాగారం చేయగలిగిన వారు చేయవచ్చు. ఇక రరేపు ఉదయం ద్వాదశి ఘడియలు రాగానే అభ్యంగ స్నానము చేసి లక్ష్మీనారాయణుల పూజ చేసి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఉపవాసమున్నవారు తమ ఉపవాసాన్ని విరమించవచ్చు.

Share this post with your friends