నేడు కాలాష్టమి. కాలాష్టమి ఇవాళ ఏ సమయంలో ప్రారంభమైందో కూడా జ్యోతిష్యులు ముందుగానే వెల్లడించారు. వారి అభిప్రాయం మేరకు చైత్ర మాసంలో కృష్ణ పక్ష అష్టమి మే 1వ తేదీ ఉదయం 05:45 గంటలకు ప్రారంభమై మే 2వ తేదీ తెల్లవారుజామున 4:01 గంటలకు ముగుస్తుంది. మే 1వ తేదీన కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. కలాష్టమి పూజను ఎలా చేసుకోవాలంటే.. ఈ రోజున పూజ చేసే వారు ఉపవాసం ఉండాలి. కాల భైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాలాష్టమి ఉపవాసం చేస్తారు. సాయంత్రం వేళ పూజకు అనువైన సమయం. ఇక సాయంత్రం వేళ ఉపవాసం ఉండేవారు తమ పూజాగదిని మాత్రమే కాకుండా ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి.
కాలాష్టమి రోజున శివుడు తన భార్య పార్వతి దేవితో కలిసి ఈ యోగంలో కూర్చుంటాడని ప్రతీతి. అందుకే ఈ పూజకు చాలా విలువ ఇస్తారు. ఇక పూజ ప్రారంభించడానికి ముందు భైరవుడి విగ్రహాన్ని ఒక పీఠం మీద ప్రతిష్టించాలి. స్వామివారిని పంచామృతంతో అభిషేకించాలి. అనంతరం కాలభైరవుడికి సుగంధద్రవ్యాలు పూసి పూల మాలను సమర్పించాలి. దేవుని ముందు ఆవనూనెతో దీపారాధన చేసి.. భక్తితో కాలభైరవ అష్టకం పఠించాలి. అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి. తదుపరి రోజు స్వామివారి ప్రసాదంతో ఉపవాసాన్ని విరమించాలి. ఈ పూజాకార్యక్రమం నిర్వహించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతత పొందుతారట.