యాదగిరిగుట్ట ఆలయ అధికారుల కీలక నిర్ణయం.. తెలంగాణలోనే తొలి దేవాలయంగా..

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో ఓ అవకాశాన్ని భక్తులకు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అదేంటంటే.. గిరి ప్రదక్షిణ. స్వామి వారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునేలా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇలా గిరి ప్రదక్షిణ చేసుకునే ఆలయాలేమీ లేవు. ఇదే తొలి ఆలయం కానుంది. లక్ష్మీనారసింహుని గిరికి గిరిప్రదక్షిణా విధిని ఏర్పాటు చేయటం అంటే ఆలయానికి నూతన శోభను తీసుకు రావడమే. అలాగే ఆలయ పరిసరాల్లో గిరి ప్రదక్షిణ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరయనుంది.

తెలంగాణకు చెందిన వారు గిరి ప్రదక్షిణ అనగానే ఏ సింహాచలమో.. అరుణాచలమో వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం యాదగిరి గుట్టలోనూ గిరి ప్రదక్షిణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఎప్పటి నుంచో కాుద.. ఈ నెల 18వ తేదీన స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం 5.30గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా ప్రారంభమవుతున్న గిరి ప్రదక్షిణలో సుమారు ఐదు వేల మంది పాల్గొననున్నారు. ఇది ముగిసిన వెంటనే భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this post with your friends