జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. జూలై నెల 4 నుంచి వివిధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం, శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వంటివి జరగనున్నాయి.

జూలై 4 నుంచి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు

జూలై 16 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం

జూలై 17 నుంచి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

జూలై 18 నుంచి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

జూలై 18 నుంచి 22వ తేదీ వరకు శ్రీ విఖనశాచార్య ఉత్సవములు

జూలై 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ.

జూలై 26న శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం

జూలై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం

జూలై 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆడి కృతిక

జూలై 31న సర్వ ఏకాదశి

Share this post with your friends