శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం అంగరంగ వైభవంగా 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయంతో పాటు మధ్యాహ్నం వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. జూన్ 14వ తేదీ శుక్రవారం జ‌రుగ‌నున్న పుష్పయాగానికి గురువారం సాయంత్రం 6.30 నుంచి సేనాధిప‌తి ఉత్సవం, శాస్ర్తోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ విష్వక్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్యక్రమాలు చేప‌ట్టారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం జరిగింది. గోవిందరాజస్వామి అలయంలో అదిశేషునిపై శయనించి ఉన్నట్లుగా స్వామివారు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends