ప్రారంభమైన శ్రీ మావూళ్లమ్మ జేష్ట మాస జాతర మహోత్సవాలు..

ఈ రోజు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్యవాలు ఇవాళ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమం జరుగనుంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారుగా భావించే అల్లూరి, మెంటే వారి వంశస్తులతో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి ప్రతి రూపంగా గరగాలను నెత్తి ఫై పెట్టుకొని కళాకారులూ నృత్యాలు చెయ్యడం హారతులు అందుకోవడం జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు.

విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవతే భీమవరం మావుళ్ళమ్మ. తొమ్మిది దశాబ్దాల కిందట భీమవరం అనే కుగ్రామమంలో మామిడి తోటలో వెలిసింది. కాబట్టి తొలినాళ్లలో ఈ అమ్మవారిని మామిళ్లమ్మగా పిలిచేవారు. కాలక్రమంలో మావూళ్లమ్మగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసి ఈ అమ్మవారు వెలిసింది. అనంతరం భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఇక అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు.

Share this post with your friends