శని తిరోగమనం.. నాలుగు నెలల పాటు వీరికి తిరుగుండదు..

మన కర్మలకు అనుగుణంగా మనకు ఫలితాలను ఇచ్చేది శనీశ్వరుడే కాబట్టి ఆయన విషయంలో అంతా కాస్త జాగ్రత్తగానే ఉంటారు. అయితే సాధారణంగా శనీశ్వరుడు పురోగమన దిశలో ఉంటాడు. ఈసారి మాత్రం ఆయన తిరుగమనంలోకి వెళ్లనున్నారు. అంటే శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలోఉన్నాడు. జూన్ 29వ తేదీ నుంచి దాదాపు నవంబర్ 1 వరకూ తిరోగమనంలో ఉంటాడు. ఇది కొన్ని రాశులకు మేలును.. మరికొన్ని రాశులకు ఇబ్బందికర పరిస్థితులను కలుగజేస్తుంది. ఇక మేలు చేసే రాశుల వారికైతే ఈ తిరోగమనం కారణంగా పట్టిందల్లా బంగారం అవుతుందని జోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అవేంటో చూద్దాం.

వృశ్చికరాశి: ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ నాలుగు నెలల కాలంలో ఆర్థికంగా బలపడతారు. సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం పదింతలు పెరుగుతుంది. కెరీర్‌పరంగానూ అద్భుతంగానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో శుభకార్యాల వంటివి జరుగుతాయి. వీరు నిత్యం దేవుడిని పూజిస్తే మరింత మంచిది.

కన్యా రాశి: ఈ రాశివారికి శని తిరోగమనం అద్భుత యోగాన్ని తీసుకురానుంది. ఈ నాలుగు నెలలూ వీరికి తిరుగుండదు. ప్రతి పని సవ్యంగా పూర్తవుతుంది. వ్యాపారాల్లో లాభాలు తప్పనిసరిగా ఉంటాయి. డబ్బుకు లోటుండదు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.

తులారాశి: ఈ రాశివారికి జూన్ 29 నుంచి దశ తిరుగుతుందట. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయట. ఆర్థికంగానూ ఉన్నత స్థితికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలకు లోటుండదు. పెట్టుబడులకు సైతం అద్భుతమైన తరుణం. ఆర్థిక వృద్ధి, ఉద్యోగంలోనూ ఉన్నత స్థితికి వెలతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

Share this post with your friends