సప్త చిరంజీవుల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఒకరు. అయితే ఇటవలి కాలంలో మనం ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉన్నాం. ఈయన మనల్ని ఎలాంటి కష్టం నుంచైనా బయట పడేస్తాడని నమ్మకం. పైగా మనకు కష్టాలను ఎదుర్కొనే కావల్సినంత శక్తిని ఇచ్చేవాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడిని చిత్ర పటాన్ని ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. పంచముఖ ఆంజనేయ స్వామి నెగిటివ్ ఎనర్జీని కానీ.. దుష్ట శక్తులను ఇంటిలోకి రానివ్వడని నమ్మకం.
పంచ అంటే అయిదు. ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అలాగే ఆంజనేయ స్వామి భయాన్ని పోగొట్టి బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడని అంతా భావిస్తూ ఉంటారు. అయితే మనం ఇంటి ముందు పెట్టుకునే పంచముఖ ఆంజనేయ స్వామి పటంలో స్వామివారి ముఖం దక్షిణం వైపునకు చూస్తున్నట్టుగా ఉండాలి. అలాగే ఇంటి నైరుతి దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉన్నా కూడా చాలా మంచిదట. ఇక స్వామివారి ఐదు ముఖాల్లో ఒక్కొక్కటి ఒక్కో అవతారం. దక్షిణాన నరసింహావతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ద్వముఖాన హయగ్రీవ అవతారం.