ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు సంప్రదాయబద్దంగా కర్రపూజ

ఖైరతాబాద్‌ శ్రీ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. గణపతి తయారీ పనులను నిర్జల ఏకాదశి రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సంప్రదాయబద్దంగా కర్రపూజతో ప్రారంభించారు. తొలుత 1954లో ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన ప్రతిష్ట.. ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుతూ.. 60 అడుగుల విగ్రహాన్ని వరకూ ప్రతిష్టించారు. 1954లో దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు సింగరి శంకరయ్య స్థానిక బస్తీ వాసులను కలుపుకొని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీని స్థాపించారు.

అప్పటి నుంచే గణేష్ విగ్రహ ప్రతిష్ట ప్రారంభమైంది. శంకరయ్య మరణానంతరం ఆయన సోదరులు సింగరి నరసింహ, సింగరి సుదర్శన్‌ స్థానికుల సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తూ వచ్చారన్నారు.ప్రస్తుతం చైర్మన్‌గా దివంగత సింగరి సుదర్శన్‌ కుమారుడు సింగరి రాజ్‌ కుమార్‌, అధ్యక్షులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఉన్నారు. ఈ ఏడాది నవరాత్రోత్సవాలను నూతన కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అందులో భాగంగానే సోమవారం కర్రపూజ వేడుకలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

Share this post with your friends