నవరాత్రులలో ఆడవారిలా మగవారు రెడీ అయి గర్భా డ్యాన్స్

నవరాత్రి సంబరాలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అన్ని అమ్మవారి దేవాలయాలూ కళకళలాడుతున్నాయి. నవరాత్రులలో కొన్ని రాష్ట్రాల్లో దుర్గాపూజతో పాటు దాండియా, గర్బా నృత్యాలు జోరుగా నిర్వహిస్తారు. ముఖ్యంగా గుజరాత్’లో గర్భా నృత్యం నవరాత్రుల సమయంలో తప్పక చేస్తారు. నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ఇది జరుగుతుంది. చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ అందంగా గర్భా డ్యాన్స్ చేస్తారు. అయితే ఇక్కడ ఓ విశేషం ఉంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని షాపూర్ ప్రాంతంలోని సాధు మాత గలి, అంబా మాత ఆలయంలో గర్భా నృత్యం ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రత్యేకతేంటంటే.. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆండ్రీ అష్టమి రాత్రి, పురుషులందరూ స్త్రీల వేషధారణతో చీరలు కట్టుకుని, ఉత్సాహంగా గుడిలో, వీధుల్లో గర్బా నృత్యం చేస్తారు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు.. 200 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతితో పాటు మంచి ఆరోగ్యం, పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా పుట్టడం వంటి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

Share this post with your friends