ఈ మొక్కను ఇంట్లో పెట్టారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

హిందూ సంప్రదాయంలో మొక్కలను, చెట్లను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో చెట్టులో ఒక్కో దేవత కొలువై ఉంటారని నమ్మకం. ముఖ్యంగా రావి చెట్టులో అయితే సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అయితే మనం ప్రస్తుత తరుణంలో ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగానే పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరి నివాసంలోనూ దాదాపుగా మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మొక్కకు పూజలేమీ అవసరం లేదు. కేవలం ఇంట్లో పెట్టుకుంటే చాలు.. ఇల్లు అందంగా ఉండటంతో పాటు ఆనందంగా ఉంటుందని ఆర్థిక సమస్యలుండవని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.

అయితే మనీ ప్లాంట్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదట. మనీ ప్లాంట్ విషయంలోనూ కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనట. అలా పెడితేనే ఇంట ఆనందం, ఐశ్వర్యం నెలకొంటుందట. ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఓ ప్రయత్నంగా మనీ ప్లాంట్‌ను సైతం ఇంట్లో పెట్టుకుంటారు. అయితే మనీ ప్లాంట్ కోసం కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలుంటాయట. అక్కడ పెడితేనే ఫలితం బాగుంటుందట. మనం మనీ ప్లాంట్‌ని పెట్టే ప్రాంతాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులుంటాయట. మనీ ప్లాంట్‌లో ఆగ్నేయ దిశలో పెట్టాలట. అలా పెడితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. ఇక పెట్టకూడని ప్రాంతమైతే ఈశాన్య దిశ. ఈ దిశలో అస్సలు పెట్టకూడదట.

Share this post with your friends