12 ఏళ్లకోసారి విగ్రహాలను మార్చడం గురించి విన్నారా? అది ఎక్కడంటే..

ఏ ఆలయంలోనూ విగ్రహాలను మార్చడం జరగదు. అవి పూర్తిగా ధ్వంసమైతే తప్ప మార్చరు. ఇక్కడ మాత్రం క్రమం తప్పకుండా పుష్కరానికోసారి మారుస్తారు. అసలెందుకు ఇలా మారుస్తారు? దీని వెనుక కథేంటో చూద్దాం. అది మరెక్కడో కాదు.. దేశంలోనే ప్రఖ్యాంతి గాంచిన ఆలయమైన పూరి జగన్నాథ ఆలయంలో. ఇక్కడి ఆలయంలో 12 ఏళ్లకోసారి విగ్రహాలను మారుస్తారు. దీనిని నవకళేబర అని పిలుస్తారు. అంటే పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించడం అన్నమాట. అసలెందుకు ఇలా చేస్తారు? అంటే దీనికి ఓ కారణం ఉంది. ఇక్కడ కొలువైన శ్రీకృష్ణుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర, సుదర్శన విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు.

అవి ఎక్కడ క్షీణిస్తాయో అనే భయంతో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వాటిని మారుస్తారు. అయితే ఈ శిల్పాలను చెక్కేందుకు ఎంచుకునే చెక్క విషయంలోనూ చాలా జాగ్రతత్తలు పాటిస్తారు. ఈ శిల్పాలను వేప చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. ఆ వేపచెట్టు ఏడాదో.. రెండోళ్ల క్రితానిదో కాదు.. 100 ఏళ్ల వయసుండాలి. ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు కొత్త విగ్రహాల కోసం ఎలాంటి లోపం లేని.. అవసరమైన చెట్లను ఎంపిక చేస్తాడు. అనంతరం ఈ చెట్లను నరికి ఆలయానికి తీసుకొస్తారు. ఆ చెక్కతో మూడు దేవతల ఆకారాలను తీర్చి దిద్దుతారు. ఆ తరువాత అత్యంత గోప్యంగా విగ్రహాలను మార్పిడి కార్యక్రమాన్ని చేపడతారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఆషాఢమాసంలో శుక్ల పక్షం రెండవ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది.

Share this post with your friends