సాగర మథన సమయంలో ఆ పాత్ర ఇప్పటికీ ఉందా?

కొంతమంది పురాణాలను పుక్కిటి పురాణాలని కొట్టిపడేస్తూ ఉంటారు. అయితే పురాణగాథలకు సంబంధించి ఎన్నో సజీవ సాక్ష్యాలు భూమిపై ఇప్పటికే కనిపించాయి.. ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి కూడా. మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు వాసుకిని కవ్వంగా చేసుకుని మధించారు. బీహార్‌లోని భాగల్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఈ మంధర పర్వతం ఉంది. దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు. మంధర శిఖరం 800 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పుడు ఈ పర్వతం మూడు మతాలకు పుణ్యక్షేత్రం.

సముద్ర మథనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించిన విషయం తెలిసిందే. ఈ హాలాహలాన్ని శివుడు కంఠంలో దాచుకుని గరళ కంఠుడు అయ్యాడు. సాగర మథనంలో మొత్తం 14 అద్భుత విషయాలు ఉద్భవించాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సముద్ర మథన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికీ పర్వతంపై ఉంది. ఈ ప్రదేశానికి ఒక పేరు కూడా ఉంది. అదే శంఖ కుండం. శ్రీ మహా విష్ణువు మధు కైటబ్ అనే రాక్షసులను సంహరించి మందర పర్వతాన్ని ఆర్యులకు అప్పగించాడు. ఇప్పుడు ఈ ప్రదేశం మధుసూదన్ ధామ్‌గా పిలవబడుతోంది. భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ఓ సరస్సు కూడా ఉంది. పర్వతం కింద తూర్పు వైపున ఉన్న ఈ సరస్సు పేరు పాపాహారిణి.

Share this post with your friends