కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసినా లేదంటే ఇంట్లో వివాహం జరిగినా.. శ్రావణ మాసంలో.. ఇతర సందర్భాల్లోనూ మనం తప్పక గృహ ప్రవేశం చేసుకుంటూ ఉంటాం. సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని అంటారు. అంతేకాకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటేనే కాదు.. కథను విన్నా కూడా చాలా మంచిదని చెబుతుంటారు. అయితే తొలిసారి సత్యనారాయణ వ్రత కథను ఎవరు విన్నారో తెలుసా? శ్రీమద్ భగవత్ మహాపురాణం, స్కంద పురాణం ప్రకారం అయితే పార్వతీ దేవి తొలిసారిగా ఈ కథను విన్నదట. పరమేశ్వరుడు ఆ కథను పార్వతీమాతకు వివరించాడట.
పైన చెప్పుకున్న రెండు గ్రంథాల ప్రకారం పార్వతీ మాతే సత్యనారాయణ వ్రత కథను విన్న మొదటి శ్రోత అని తెలుస్తోంది. ఇక ఈ కథను శంకరుడు.. అమర్‌నాథ్ గుహలో వివరించాడని చెబుతారు. స్కంద పురాణం ఈ విషయాన్ని చెబుతోంది. అయితే కథ చెబుతున్న సమయంలో శివుడు పార్వతీ దేవిని కొన్ని సార్లు ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నాడట.. మరికొంత సేపు తన ముందు కూర్చోబెట్టుకున్నాడట. పై రెండు గ్రంథాల ప్రకారం.. భగవంతుడు నారాయణుడు సత్యం.. కనుక సత్య నారాయణుని కథ అనగా శ్రీమద్ భగవత్ కథ సత్య నారాయణుని కథ అని పేర్కొన్నారు.