భారతదేశంలో హిందూ దేవాలయాలకు కొదువ లేదు. అలాంటి దేవాలయాల్లో చాలా మహిమాన్విత దేవాలయాలు, ఆశ్యర్యం కలిగించే దేవాలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి తమిళనాడులోని కన్యాకుమారిలో సుచింద్రం శక్తిపీఠంగా పిలవబడే ఆలయం ఉంది. ఆ ఆలయంలో త్రిమూర్తులు ఉంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే. త్రిమూర్తులైన శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్నే స్థనుమలయం అని పిలుస్తారు. స్తను అంటే శివుడు, మాల్ అంటే విష్ణువు, ఆయ అంటే బ్రహ్మ అని అర్థం. ఇక ఈ ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడ సతీదేవి దంతం పడిందట. ఇది శక్తిపీఠంగా కూడా విరాజిల్లుతోంది.
సుచింద్రం శక్తి పీఠాన్ని తనుమలయన్ లేదా స్థనుమలయ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గణపతిని రకరాకాల భంగిమలో పుజిస్తారు. గణపతి స్త్రీ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి గణపతిని విఘ్నేశ్వరి అని అంటారు. ఇలా విఘ్నేశ్వరుడు స్త్రీ రూపంలో పూజలు అందుకోవడం దేశంలోనే ఇక్కడ ఒక్కచోటే జరుగుతుంది. ఇక ఈ ఆలయంలో ఒకటో రెండో కాదు.. ఏకంగా ముప్పై ఆలయాలున్నాయి. విష్ణుమూర్తి అష్టధాతువు విగ్రహాన్ని సైతం మనం ఇక్కడే చూడవచ్చు. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న అలంగార మండపంలో ఒకే గ్రానైట్‌తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలు ఉంటాయి. అవి విశేషంగా ఆకట్టుకుంటాయి.